ఐదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన సింగరాయకొండ మండలం కలికివాయలో ఆదివారం జరిగింది.
చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
సింగరాయకొండ : ఐదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన సింగరాయకొండ మండలం కలికివాయలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు. .గ్రామానికి చెందిన అయిదేళ్ల బాలిక తల్లిదండ్రులు పచ్చాకు కూలీ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. కుమార్తెను పెద్దమ్మ వెంకాయమ్మ దగ్గర ఉంచారు. ఆదివారం ఇంటి వద్ద ఉన్న చర్చికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వరరావు (50) బాలికను చర్చి సమీపంలో మరుగుగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు కోటేశ్వరరావును చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానిక సీఐ గుంజి తిరుమలరావు, ఎస్సై మల్లికార్జునరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.