పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో రైలు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయమం రైలు పట్టాలపై గాయాలతో పడి ఉన్న యువకుడిని గుర్తించిన స్థానికులు 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పట్టణవాసులు మార్నింగ్ వాక్‌కు వెళ్లగా వారికి రైలు పట్టాలపై పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. తలకు బలమైన గాయాలు కావటంతో అపస్మారక స్థితిలో ఉన్నాడని స్థానికలు తెలిపారు. పట్టాలు దాటుతూ రైలు ఢీకుని ఉంటుందని భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.