
నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త
అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది.
అనంతపురం: అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు వెళ్తున్న భార్యపై ఆమె భర్త దాడి చేశాడు. ఆ క్రమంలో ఆమె భర్తకు ఎదురు తిరిగింది. దాంతో ఆగ్రహించి భర్త తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి... ఆమె గొంతుకోశాడు. దాంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.