కర్నూలు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఏసుదాసు(47) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని రోజులుగా భార్య రత్నమ్మతో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.