విరగబూసిన మామిడి పూత | Mango Tree Blossomed With Full Of Flowers | Sakshi
Sakshi News home page

విరగబూసిన మామిడి పూత

Published Tue, Mar 5 2019 6:46 PM | Last Updated on Tue, Mar 5 2019 6:47 PM

Mango Tree  Blossomed  With Full Of Flowers - Sakshi

రామసముద్రంలో విరగబూసిన మామిడి పూత  

సాక్షి, రామసముద్రం : చిత్తూరూ జిల్లా మదనపల్లె మండలం రామసముద్రంలో మామిడి పూత విరగబూసింది. తీవ్ర వర్షాభావంతో చాలా వరకు మామిడి చెట్లు నీరు లేక ఎండిపోయాయి. కొందరు రైతులు అష్టకష్టాలు పడుతూ నీరు అందిస్తున్నారు. అలాగే మందులు పిచికారీ చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడి పూత బాగా పూయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 250 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం చెట్లలో పూత, పిందె విరగబూసింది. పూత, పిందె రాలిపోకుండా నిలిస్తే మంచి దిగుబడి వస్తుందని, మామిడి ధరలు ఆశాజకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement