‘అన్న’ల అలికిడి
Published Fri, Oct 11 2013 2:57 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి మైలారపు అడెల్లు ఉరఫ్ భాస్కర్, బండి ప్రకాశ్ ఉరఫ్ ప్రభాకర్ నేతృత్వంలో దళాలు సంచరిస్తున్నా యి. కచ్చితమైన సమాచారం మేరకు పోలీసు లు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్, దహెగాంతోపాటు కవ్వాల్ అభయారణ్యం, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర- మహారాష్ర్ట సరిహద్దుల్లో నదితీరం దాటే అవకాశం ఉన్న ప్రాంతాలపైనా నిఘా పెట్టిన పోలీసులు మావోయిస్టు పార్టీ సాయుధ దళాల కోసం అడవులను జల్లెడ పట్టడం కలకలం రేపుతోంది.
ఆంధ్ర-మహారాష్ర్ట సరిహద్దుల్లో అలర్ట్
తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తం అయ్యారు. మారుమూల పోలీసుస్టేషన్ల అధికారులు, సిబ్బందితో ైవె ర్‌లెస్, సెల్‌ఫోన్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రాణహిత పరీవాహక ప్రాంతాలను వదిలి మహారాష్ట్ర నుంచి జిల్లాకు ప్రవేశించే ప్రధాన మార్గాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో డిస్ట్రిక్ట్‌గార్డ్, స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి గతంలో మూడు చోట్ల డంప్‌లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని భావించిన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయడంతో మళ్లీ అటవీ ప్రాంతాల ప్రజలు ఆందోళన మొదలైంది. ప్రధానంగా తిర్యాణి దట్టమైన అడవులకు తోడు కవ్వాల అభయారణ్యంపైనే పోలీసులు ఈసారి దృష్టి సారించి మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
20 మందితో మావోయిస్టుల సంచారం
తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్, దహెగాంతోపాటు కవ్వాల్ అభయారణ్యం, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో పోలీసులు ఐదు రోజులుగా కూంబింగ్ జరుపుతుండటం కలకలం రేపుతోంది. జిల్లాలో కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవలే సాయుధ దళాలు జిల్లాలో ప్రవేశించినట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం ఉంది. ఇదే విషయమై 25 రోజుల క్రితం అక్టోపస్ డీఐజీ విసీ సజ్జనార్ తూర్పు జిల్లా పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. అప్పటి నుం చి జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టి సారిం చారు. ఇదిలా వుండగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న జిల్లాకు చెందిన 13 మంది మావోయిస్టులను పోలీసుశాఖ ‘మోస్ట్‌వాంటెడ్’గా ఇదివరకే ప్రకటించారు.అయితే ఇటీవల మిలటరీ ఇంటెలిజెన్స్ సభ్యుడు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాకర్, జిల్లా కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌లతోపాటు 20 మంది సాయుధులు జిల్లాలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి అడుగుల వెంటే కూంబింగ్ నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement