నెల్లూరు జిల్లాలో మెరైన్ ఇన్స్టిట్యూట్ | Marine institute to set up in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో మెరైన్ ఇన్స్టిట్యూట్

Published Thu, Sep 4 2014 1:58 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాలో మెరైన్ ఇన్స్టిట్యూట్ - Sakshi

నెల్లూరు జిల్లాలో మెరైన్ ఇన్స్టిట్యూట్

హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రకటించింది. రాజధానిపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏయే జిల్లాకు ఏమేం చేస్తామో ఈ సందర్భంగా ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో ఆటో మొబైల్ హబ్, ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పులికాట్ సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బీసీఐసీ వాడలు, దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి చేస్తామని హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement