కుటుంబ కలహాలతో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
కుటుంబ కలహాలతో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ(25) ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.