'6 నెలల్లో రాజధాని మాస్టర్ప్లాన్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టార్ ప్లాన్ను ఆరు నెలల్లో ఇస్తామని సింగపూర్ నిపుణులు హామీ ఇచ్చారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సింగపూర్ నిపుణులు బృందంలో కలసి రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు.
రాజధాని ప్రాంతంలోని వనరులు, భౌగోళిక పరిస్థితుల గురించి 3 గంటల పాటు సింగపూర్ నిపుణులతో చర్చించామని మంత్రి చెప్పారు. గతంలో చైనాలో సింగపూర్ బృందం చేపట్టిన నిర్మాణాల గురించి వారు వివరించారని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. ఈ కమిటీలో సింగపూర్ చెందినవారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నతాధికారులు ఉంటారని నారాయణ తెలిపారు.