ఏపీ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. పేరున్న సంస్థలన్నీ తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించుకోవాలంటే వందలు కాదు వేల కోట్లు అవసరమవుతాయని వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదికలో పేర్కొంది. ఇటీవలే ముఖ్యమంత్రికి అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితులు, ఆస్పత్రులు, వాటి పనితీరు, ఏఏ సంస్థలు కొత్తగా నిర్మించుకోవాలి లాంటి వాటిపై ఓ నివేదిక ఇచ్చారు. రాష్ర్టంలో ఒక్క ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) మాత్రమే నిర్మిస్తే సరిపోదని, నిమ్స్ లాంటి దాన్ని రూపొందించుకోవడానికి రికరింగ్ డిపాజిట్ రూపంలోనే రూ.200 కోట్లు అవసరమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న అటానమస్ సంస్థ స్విమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడానికి రూ.100 కోట్లు ఖర్చవుతుందని నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో ఎంఎన్‌జే తరహాలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ లేదని, అలాంటి సంస్థను నిర్మించుకునేందుకు రూ.200 కోట్లు అవసరమవుతుందని నివేదికలో ఇచ్చారు.
విభజనతో వీధిన పడ్డాం
Published Tue, Jul 22 2014 2:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement