
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో థర్మల్ స్క్రీనింగ్ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. తద్వారా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో ముందడుగు వేశామని.. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రోజుకి 25 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి సరిపడా కిట్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం నుంచే థర్మల్ స్కానర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగామన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి... అన్నిరాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా స్క్రీనింగ్ బాగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులన్నీ క్వారంటైన్‌లో ఉన్నవారికి సంబంధించినవేనని తెలిపారు. (అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’)
ఇక లాక్‌డౌన్ అమలు గురించి మాట్లాడుతూ.. రెడ్‌జోన్ లో ఉన్న పరిశ్రమలను తెరవడం లేదు. కేవలం గ్రీన్ జోన్ లో ఉన్న పరిశ్రమలకే అనుమతులిస్తున్నాం. ఇప్పటి వరకు 160 వరకు అనుమతులిచ్చాం. కార్మికుల రక్షణ కు జాగ్రత్తలు తీసుకున్నవారికే అనుమతిస్తున్నాం. ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని మేకపాటి హామీ ఇచ్చారు.(గన్నవరం చేరిన కోవిడ్ 19 మెడికల్ కిట్లు)
Comments
Please login to add a commentAdd a comment