మోదీకి మేకపాటి లేఖ | Mekapati Writes Letter to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీకి మేకపాటి లేఖ

Published Sun, Nov 26 2017 10:22 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

Mekapati Writes Letter to PM Narendra Modi - Sakshi - Sakshi

సాక్షి, నెల్లూరు : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. పార్టీ మారిన వారిపై సభాపతులు చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహించడం సరికాదన్నారు. అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదిని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement