
నల్లధనం వెనక్కి తేవాలి: ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: నల్లధనం వెనక్కి తెస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లధనంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని, నల్లధనం వెనక్కి తేవాలని కేంద్రాన్ని కోరారు. నల్ల ధనం వెనక్కి తెస్తే సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టవచ్చన్నారు. ‘దాదాపు 30 లక్షల కోట్ల నల్లధనం ఉందంటున్నారు. ఈ ధనం వస్తే కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేయవచ్చు. జాతీయ రహదారులు నిర్మించొచ్చు. 24 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయొచ్చు. అందువల్ల మీరిచ్చిన హామీని నెరవేర్చండి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి’ అని మేకపాటి కోరారు.