మెట్‌పల్లి యువతికి బంగారు పతకం
Published Thu, Oct 3 2013 4:49 AM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM
మెట్‌పల్లి, న్యూస్‌లైన్ : పట్టణంలోని బుక్కవాడకు చెందిన వేముల శరణ్య సెంట్రల్ యూనివర్సిటీ గోల్డ్‌మెడల్ దక్కించుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరి గిన యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవంలో శరణ్య గవర్నర్ నర్సింహన్ చేతులమీదుగా ఈ మెడల్‌ను అందుకుంది. ఒకటి నుంచి పదవతరగతి వరకు పట్టణంలోనే చదివిన శరణ్య ఇంటర్, డిగ్రీలు ధర్మపురిలోని సంస్కృతి కళాశాలలో చదివింది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ(ఎంఏ తెలుగు విభాగం) ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి సీటు పొందింది. అనంతరం జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబర్చి యూనివ ర్సిటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి గాను ఆమెను గోల్డ్‌మెడల్‌కు ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన రావూరి కాంతమ్మభరద్వాజ్ అనే స్వచ్చంద సంస్థ కూడా శరణ్యకు గోల్డ్‌మెడల్ ప్రకటించింది. ఈ సంస్థ ఏటా రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థినికి అందిస్తోంది. ఈసారి శరణ్యను ఎంపిక చేసింది. ఈ మెడల్‌ను కూడా గవర్నర్ ఆమెకు అందజేశారు.
Advertisement
Advertisement