ఎమ్మిగనూరు టౌన్: అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల మార్పునకు విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీస్తోంది. పాత ఏజెన్సీలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, అనుమతించ వద్దంటూ కొందరు అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేస్తుండటంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
సోమవారం రెండు వంట ఏజెన్సీల మధ్య చెలరేగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని 31 పాఠశాలల్లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలను రద్దు చేయాలంటూ అధికార పార్టీ నాయకులు ఆ పథకం త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తెచ్చారు. విషయాన్ని పసిగట్టిన ఐదు పాఠశాలల ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జూలై 3న స్టే విధించింది.
అయితే హైకోర్టు స్టేను అధికారులు లేక్క చేయలేదు. త్రిసభ్య కమిటీలోని ఎంఈఓ, ఎంపీడీఓలు పట్టణంలోని 31 ఏజెన్సీలను రద్దు చేసినట్లు ఉత్తర్వులను ఈనెల 12న ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు పంపారు. కాని త్రిసభ్య కమిటీలో సభ్యుడైన తహశీల్దార్ సంతకం పెట్టేందుకు నిరాకరించినా ఉత్తర్వులను మాత్రం హెచ్‌ఎంలకు పంపడం గమనార్హం.
వంట..మంట!
Published Tue, Aug 19 2014 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement