విజయనగరం అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు కల్పించడం మాటెలాఉన్నా.... ఉన్న ఉపాధి ఊడగొట్టే చర్యలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన పథక నిర్వాహక మహిళా సంఘాలపై వారి కన్ను పడింది.బడిబయట విద్యార్థులను తగ్గించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యా హ్న భోజన నిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరుగుతోంది. ఏళ్లతరపడి మధ్యాహ్న భోజన వంట ను వృత్తిగా చేసుకొని ఉపాధి పొందుతున్న మహిళా గ్రూప్ సభ్యులను ఇంటికి పంపేందుకు అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు.
దీంతో జిల్లాలో 11 పాఠశాల భోజన నిర్వాహక ఏజెన్సీలను రద్దు చేస్తూ అధికారులు ఇటీవల ఆదేశాలిచ్చారు. నిబంధనల మేరకు పక్కాగా నిర్వహిస్తున్నా ఏజెన్సీలను రద్దు చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలూ లేనప్పటికీ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లే మార్చుతున్నారని మహిళాగ్రూపులు వాపోతున్నాయి. పాఠశాల పరిసరాల్లో ఉన్న మహిళా సంఘాలకు మాత్రమే నిర్వహణ బాధ్యత అప్పగించాలి. మహిళా సంఘాలు ముందుకు రాకపోతే సంఘం తీర్మానం చేసిన మహిళలకు మాత్రమే ఆ బాధ్యత ఇవ్వాలి.అయితే తమకు చెందిన వారికి ఈ బాధ్యతను అప్పగించేందుకు టీడీపీనేతలు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
11 స్కూళ్లలో ఏజెన్సీల మార్పు
జిల్లాలో 11 పాఠశాలల్లో ఏజెన్సీలను మార్చుతూ అధికారులు ఆదేశాలుజారీ చేశారు. గుర్ల మండలంలో తెట్టంగి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పెదబంటుబిల్లి, రాగోలు ప్రాథమిక పాఠశాలలు , గం ట్యాడ మండలంలోని పెంటశ్రీరామపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, నెల్లిమర్ల మండలలోని నెల్లిమర్ల, చినబోరాడ పేట ప్రాథమిక పాఠశాలలు, చీపురుపల్లిలో పెదనడిపల్లి, భోగాపురం మండలంలో పోలి పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, రామభద్రపురం మండ లం మిర్తివలస ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహక ఏజెన్సీలను మార్చుతూ ఆదేశాలి చ్చారు. దీంతో మిగతా ఏజెన్సీల మహిళలూ ఆందోళన చెందుతున్నారు.
ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా
రద్దు చేశారు
భోజన నిర్వహణపై ఇంతవరకూ ఎప్పుడూ ఎలాం టి ఫిర్యాదూ నాపై నమోదు కాలేదు. రాజకీయ ఒత్తిళ్లవల్లే నా ఏజెన్సీని రద్దు చేశారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం రద్దు ఆదేశాలిచ్చారు. మరుసుటిరోజు నుంచి అధికార పార్టీ వాళ్లకు ఇచ్చేశారు.
-జె.అప్పలనరసమ్మ, తెట్టంగి పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు
మండల స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం
పాఠశాల మధ్యాహ్నభోజన పథక నిర్వహణ ఏజెన్సీల ను తాహశీల్దార్, ఎంఈఓలతో కూడిన మండల కమిటీ, వీఏఓ, వీఆర్‌ఓ, కార్యదర్శిలతో గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాయి. వాటిపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా పరిశీలించి రద్దు చేయాలన్నా, కొనసాగించాలన్నా ఆయా కమిటీలకే సర్వాధికారాలున్నాయి. జిల్లాలోని తాజాగా జరిగిన 11 ఏజెన్సీల మార్పునకు కారణాలు ఇంకా జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంది.
-జి.కృష్ణారావు, డీఈఓ
వంటలో రాజకీయ మంట
Published Tue, Aug 19 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement