
మిలటరీ శక్తివంతమైతేనే ఆర్థికాభివృద్ధి
సమవుజ్జీలైన అంతర్జాతీయ భాగస్వామ్యాలతోనే ప్రగతి
ప్రధాని శాస్త్రీయ సలహాదారు ఆర్.చిదంబరం
తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎవరికీ తీసిపోదని ప్రధాని శాస్త్రీయ సలహాదారు, భారత అణుశక్తి సంస్థ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం అన్నారు. దేశ అభివృద్ధి, భద్రత ఒకే నాణేనికి రెండు ముఖా ల్లాంటివని, మిలటరీ రంగంలో శక్తిమంతంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధులపై దృష్టి పెట్టవచ్చ ని స్పష్టం చేశారు. సమవుజ్జీలైన అంతర్జాతీ య భాగస్వామ్యాల ద్వారానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించవచ్చన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో గురువారం ‘శాస్త్ర రంగంలో అంత ర్జాతీయ భాగస్వామ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లలో భారత్ అనేక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంద ని, వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే పొందుతున్నామన్నారు.
ఎల్‌హెచ్‌సీ నుంచి...
భారత్ ఇప్పటికే అనేక భారీస్థాయి శాస్త్ర ప్రయోగాల్లో పాలుపంచుకుంటోందని, హిగ్స్ బోసాన్ కణాన్ని గుర్తించేందుకు జరుగుతున్న ఎల్‌హెచ్‌సీ ప్రయోగాల్లోనూ అతికీలకమైన పరికరాలను మనం అతితక్కువ ఖర్చుతో సరఫరా చేశామన్నారు. అలాగే ఈ ప్రయోగా ల్లో వాడుతున్న సీఎంఎస్ డిటెక్టర్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వ ర్యంలో నిర్మాణమైతే.. అలీస్ డిటెక్టర్‌ను కోల్ కతా గ్రూపు నిర్మించిందన్నారు. 2004 నాటి సునామీ తరువాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరికల కేంద్రం ఇప్పుడు హిందూమహా సముద్ర తీరంలోని అనేక దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోందని, ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించిందని తెలిపారు. అణుశక్తి ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వీలవుతుం దని.. అయితే ఇందుకోసం రేడియో ధార్మిక వ్యర్థాల సమర్థ పునర్ వినియోగం జరగాలని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలతో అగ్రస్థానానికి..
అంతర్జాతీయ భాగస్వామ్యాలతో మనం మెరుగైన ఫలితాలు సాధించగలమనేందుకు యూరోపియన్ సంస్థలతో జరిగిన ఒప్పందాలు తార్కాణమని చిదంబరం తెలిపారు. జన్యుమార్పిడికి పనికొచ్చే జెర్మ్ ప్లాస్మాను మార్పిడి చేసుకోవడం ద్వారా 30 శాతం అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాన్ని సృష్టించగలిగామన్నారు. ఇలాంటివి మరిన్ని భాగస్వా మ్యాలు కుదరడం మనకు అవసరమని అన్నారు. మన శక్తి సామరŠాథ్యలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తృతం చేయడం ద్వారా శాస్త్ర, పరిశోధన రంగాల్లో మనం అగ్రస్థానానికి చేరుకోవచ్చునని ఆకాంక్షించారు.