యిత్తనం కొనలేం! | Miller envisaged abruptly crushed roasted vittanakayala Prices | Sakshi
Sakshi News home page

యిత్తనం కొనలేం!

Published Thu, Jun 12 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

యిత్తనం  కొనలేం!

యిత్తనం కొనలేం!

వేరుశెనగ విత్తనకాయల ధరలను అమాంతం పెంచేసిన మిల్లర్లు
కిలోకు రూ.10 నుంచి 12 దాకా పెంపు 
వేరుశెనగ సాగుకు ఇదే మంచి అదను
ఇప్పటిదాకా జిల్లాకు చేరని సబ్సిడీ విత్తనకాయలు
విత్తనాలు లేని రైతుల గుండెల్లో రైళ్లుట

 
 పలమనేరు: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో అదునులోనే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశెనగ సాగుకు దుక్కులు దున్నుకుని రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు సకాలంలో అందలేదు.  ఈ తంతును గమనించిన ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు విత్తన కాయల ధరలను అమాంతం పెంచేశారు. విత్తనాలను ఉంచుకున్న రైతులు మాత్రం ఇప్పటికే చేలల్లో విత్తనాలు వేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలను నమ్ము కున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అదను మీరిపోతే సకాలంలో మళ్లీ వర్షాలు కురవకపోతే విత్తనాలు ఎలా వేసేదని మిగిలిన రైతులు మధనపడుతున్నారు. మొత్తం మీద వ్యవసాయశాఖ పుణ్యకాలం పూర్తయ్యే లోపు విత్తనాలను పంపిణీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో 53 మండలాలు, 9 వ్యవసాయశాఖ డివిజన్లలో ఈ దఫా లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ భావిం చింది. ఈ డివిజన్ల పరిధిలో సుమారు 1,45,800 హెక్టార్లలో వేరుశెనగ సాగు కావాల్సి ఉంది. లక్షా ఎనబై వేల మంది రైతులు వేరుశెనగ సాగుపైనే ఆధారపడి ఉన్నారు. మొన్న కురిసిన వర్షాలతో భూమిలో తేమ మరో వారం రోజుల వరకు ఉంటుంది. ఈ అదను లోపు విత్తనాలు వేయకపోతే పంట దిగుబడి అంతంత మాత్రమే. సీజన్ గడిచే కొద్దీ రైతులకు ఇబ్బందులే. జిల్లాలోని పడమటి ప్రాంతాలైన కుప్పం,పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

 కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు

ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మార్కెట్‌లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.

సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం

ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగాయి. దీంతో గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్‌లోనూ అంతే

 ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనే చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్‌లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు.

సంప్రదింపులు జరుగుతున్నాయి

విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక ఇంకొటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం.
 - రవికుమార్, వ్యవసాయశాఖ , చిత్తూరు
 
 ఫోటోరైటప్స్:

 11పీఎల్‌ఎన్‌ఆర్06,07: భారీగా ధర పెరిగిన వేరుశెనగ విత్తనాలు
 11పీఎల్‌ఎన్‌ఆర్08,09: కుప్పం ప్రాంతంలో ఇప్పటికే చేళల్లో వేరుశెనగ విత్తనాలను వేస్తున్న రైతులు ఠ మొదటిపేజీ తరువాయి
 పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి లో ఉన్నారు.

 కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు

 ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మా ర్కెట్‌లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.

సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం

ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగా యి. దీంతో గత రెండు రోజులుగా ప్రభు త్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

 సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్‌లోనూ అంతే

 ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనేది చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్‌లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు.
 
సంప్రదింపులు జరుగుతున్నాయి

విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక మరొకటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం.
 - రవికుమార్, వ్యవసాయశాఖ, చిత్తూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement