
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డవారిని మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తెలంగాణలోని ముణుగూరులో జరిగే వివాహానికి వెళ్లేందుకు ఏలూరు నుంచి 280 మంది మిని బస్సులో బయలుదేరారు. పుట్లగట్లగూడెం వద్దకు రాగానే బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment