
సాక్షి, తూర్పుగోదావరి: పి.గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పర్యటించారు. దేవీపట్నం ముంపునకు కారణం కాపర్ డ్యాం నిర్మాణమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో వరద బాధితులకు ఆహారం, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా శివాయిలంక కాజ్‌వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.