బ్లాక్‌మెయిల్‌తో రూ.1.34 కోట్లు వసూలు
అదుపులో గ్యాంగ్ సభ్యులు
న్యాయవాది పాత్రపై టాస్క్‌ఫోర్స్ ఆరా
విజయవాడ సిటీ : ఓ మత బోధకుడిని డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలి సింది. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు పరార్ కాగా పట్టుబడిన న్యాయవాది పాత్రపై పోలీ సులు ఆరా తీస్తున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో మత బోధకుడిని పటమట ప్రాంతానికి చెందిన సుధీర్ అనుచరులతో కలిసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.
పెనమలూరు నియోజకవర్గంలో పొదుపు సంఘాలు నిర్వహించే సుధీర్ మత బోధకుడి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. సెప్టెంబర్, 2005 నుంచి మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్‌డ్రైవ్ తమ వద్ద ఉందని, రూ.4 కోట్లు ఇస్తే ఇచ్చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అప్పటి నుంచి పలుమార్లు దశలవారీగా మత బోధకుడు రూ.1.34 కోట్లు సుధీర్ గ్యాంగ్‌కు ఇచ్చాడు. మిగిలిన డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో కొద్ది రోజుల కిందట మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి మత బోధకుడి బ్లాక్‌మెయిల్ చేస్తున్న గ్యాంగ్ పట్టివేతకు గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్ లీడర్ సుధీర్ నగరంలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిని ముందే ఊహించిన సుధీర్ అక్కడి నుంచి పరార్ కాగా ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది కరుణేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని సమాచారంపై మత బోధకుడిని బ్లాక్‌బెయిల్ చేస్తున్న గ్యాంగ్‌లోని కొందరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. న్యాయవాది వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్ ఖాళీగా ఉన్నట్లుచెబుతున్నారు.
మధ్యవర్తిత్వమా..
టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న న్యాయవాది కరుణేంద్ర మధ్యవర్తిత్వం నెరిపేందుకు వెళ్లినట్టు న్యాయవాద వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా మత బోధకుడిని బెదిరింపులకు గురి చేస్తున్న సుధీర్ వద్దకు వెళ్లి అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకోవద్దని, పెన్‌డ్రైవ్ ఇస్తే పోలీసుల చర్యలు లేకుండా మత బోధకుడితో మాట్లాడతానని చెప్పినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి చర్చించుకుంటుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారని, అప్పటికే సుధీర్ తప్పించుకోగా న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సహచరుల వాదన. దీనిపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్‌ను సంప్రదించగా విచారణ జరుగుతోందని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మత బోధకుడికి బెదిరింపులు
Published Fri, Mar 11 2016 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement