అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వై.బాలనాగిరెడ్డి
పెద్దకడబూరు (కర్నూలు): పులికనుమ ప్రాజెక్టుకు మహానీయుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పురుడు పోశారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. తానే వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడి బసలదొడ్డి చింతల చెరువుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేయించానన్నారు. అయితే తిక్కారెడ్డి చింతల చెరువును ప్రారంభించడంపై మండిపడ్డారు. మండలంలోని బసలదొడ్డి గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బోడెన్న (ఈరన్న) కుటుంబ సభ్యులను పరామర్శించి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు తదితర సమస్యలకు ఎంత ఖర్చు అయినా సరే తామే భరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎస్సీ కాలనీలోని చర్చిలో బాలనాగిరెడ్డి ప్రత్యేక పార్థనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల అండతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి అలంకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘురాముడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయేంద్రారెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యల్లప్ప, నాయకులు దేవదానం, పరమేష్, లంకారెడ్డి, శివరాం, మల్లికార్జున, హంపయ్య, డీలర్ అంజినయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment