
పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం
ఎమ్మెల్యే పిన్నెల్లి
మాచర్ల : ప్రభుత్వం పోలీసుల సాయంతో పత్రికా స్వేచ్ఛను హరించాలని చూడటం దారుణమని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మాచర్లలోని వైస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో టీడీపీ అధికారంలోకి వచ్చి అరాచక పాలన సాగిస్తోందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, వాటిని ప్రశ్నిస్తున్న ప్రసార మాధ్యమాలను అణచివేయాలని చూస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చురకలు వేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికీ విరుచుకుపడటం విచారకరమన్నారు.
వాగ్దానాలు మరిచి.. దృష్టి మరల్చి..
కరాలపాడు (పిడుగురాళ్ళ రూరల్ ) : చంద్రబాబునాయుుడు ఎన్నికల్లో తగని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేకపోయారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కరాలపాడులో ఓ వివాహ మహోత్సవానికి ఆయన హాజరై అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాజధానిపై ఫోకస్ చేసి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారన్నారు. సింగపూర్, వులేషియూ, చైనాలా రాజధాని తీర్చిదిద్దుతానంటూ బీరాలు పలుకుతున్నారని అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రునిరామిరెడ్డి, ఎంపీటీసీ ఫోర్ లీడర్ తాటికొండ చిన అంజనేయుులురెడ్డి, వుండల కన్వినర్ చల్లా పిచ్చిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సత్తార్ సీతారామిరెడ్డి, వూర్కెట్ యూర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, సర్పంచివుహాలక్ష్మవ్ము, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, రవి, శివారెడ్డి, రవుణారెడ్డి, బత్తుల కోటిరెడ్డి, వూజీ సర్పంచి జిలానీ పాల్గొన్నారు.