సాక్షి, విజయవాడ: బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే పార్టీ, విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో పార్టీలు ఉన్నా కేవలం ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారన్నారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేయలేదని విమర్శించారు.
రాజ్యాధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇంకా సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకోమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment