
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కొత్తగా వచ్చిన మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీని భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. తొలిరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేద ని రిటర్నింగ్ అధికారి, ఏపీ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 21 వరకూ నామినేషన్లు స్వీకరించి 22న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 25 తుది గడువు. అవసరమైన పక్షంలో జూన్ ఒకటిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకూ ఎన్నికలు నిర్వహించి ఐదు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
20న గోవిందరెడ్డి నామినేషన్.. : ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డీసీ గోవిందరెడ్డి ఈ నెల 20 న నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.