ఇక నెల నెలా స్కాలర్‌షిప్‌లు
మే నుంచే అమలు
పూలే జయంత్యుత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం/విశాఖ(కల్చరల్): మే నుంచి విద్యార్థులకు నెల నెలా స్కాలర్ షిప్‌లు అందించనున్నట్లు ఏపీ సీఎం చంద్ర బాబు ప్రకటించారు. విశాఖలో మంగళవారం జరిగిన మహా త్మా జ్యోతిబా పూలే 191వ జయంత్యుత్సవాల్లో బాబు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు లేకుంటే తమ పార్టీ లేదన్నారు. వారి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కులవృ త్తులు, చేతివృత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు ఆదరణ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి అచ్చెన్నా యుడు మాట్లాడుతూ.. బీసీల్లో ఉన్న అన్ని కులాలవారితో త్వరలో జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నా రు. అనం తరం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల బీసీలకు మంజూరైన యూనిట్లను, సంక్షేమ పథ కాల కోసం మంజూరైన రూ.109 కోట్ల చెక్కులను, ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 450 మంది ఎస్సీ లబ్ధి దారులకు మంజూరైన రూ.6.75 కోట్ల చెక్కులను సీఎం అందజేశారు. సమావేశంలో మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీని వాసరావు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు నృత్యమాలిక
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో మంగళవారం ఏడువేల మంది బాలి కలతో ఏర్పాటుచేసిన కూచిపూడి మహా నృత్య ప్రదర్శన నేత్ర పర్వంగా సాగింది. ఈ ప్రదర్శనను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మహా నృత్య ప్రదర్శన సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని సీఎంతో పాటు మంత్రి ఆనందబాబు కొనియాడారు.
సీఎం ఆలస్యంతో సొమ్మసిల్లిన విద్యార్థినులు
అధికారుల ఆదేశాల మేరకు తెల్లవారుజామున 5 గంటలకే చిన్నారులంతా ప్రదర్శన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ ఉదయం 9.30కు రావాల్సిన సీఎం చంద్రబాబు.. 11.30కు గానీ రాలేదు. దీంతో విద్యార్థినులు గంటల తరబడి మండు టెండలో ఇబ్బందులు పడ్డారు. అరకొరగా టెంట్లు వేయడంతో అవి చాలక పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. మరోవైపు భోజన ఏర్పాట్లు కూడా అధ్వా నంగా ఉన్నాయి. మరీ దారుణమేమిటంటే 7వేల మంది విద్యార్థినులు ఈ కార్య క్రమంలో పాల్గొనగా.. వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయలేదు.