కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పైన ఉన్న తల్లికూతుళ్లు కిందపడ్డారు. ఆ వెనకనే వస్తున్న ఆర్టీసీ బస్సు వారిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లికూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.