తన కొడుకును ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరిక నెరవేరకపోవడంతో మనస్తాపానికి గురై ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
తిరుమలగిరి, న్యూస్‌లైన్: తన కొడుకును ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరిక నెరవేరకపోవడంతో మనస్తాపానికి గురై ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి ఆవాసపరిధి కె.ఆర్.కె తండాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లకావత్ లింగయ్య, మంజుల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఒకటో తరగతి అదే తండాలోని ప్రాథమిక పాఠశాలలో చదివేవాడు. తన కుమారున్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని మంజుల మం డల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పిం చింది. అయితే, బాలుడు ఆ పాఠశాలకు వెళ్లనని మారాం చేసేవాడు. దీంతో మానసిక సంఘర్షణకులోనై మంజుల పురుగు మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.