తణుకు (పశ్చిమగోదావరి జిల్లా) : తణుకు మండలకేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. తణుకు మండలకేంద్రం సజ్జాపురం ప్రాంతానికి చెందిన జనపనేని లక్ష్మీనరసమ్మ(32), ఆమె కుమార్తె లాస్య(7) వేల్పూరు గ్రామశివారులో గోస్తనీ కాలువలో మంగళవారం శవాలై తేలారు. వీరు ఈ నెల 3 వ తేదీ రాత్రి నుంచి కనపడటం లేదు. నరసమ్మ తన కూమార్తెను నడుముకు కట్టుకుని గోస్తనీ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. భర్త సూర్యనారాయణ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాలను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.