భూమయ్య మృతి ఉద్యమాలకు లోటు | Movements in bhumayya deficit | Sakshi
Sakshi News home page

భూమయ్య మృతి ఉద్యమాలకు లోటు

Published Fri, Dec 27 2013 4:14 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Movements in bhumayya deficit

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని టీపీఎఫ్, తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. గురువారం నల్లగొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద  భూమయ్యకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
 
 అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నాలు గు దశాబ్ధాలుగా ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడని కొనియాడారు. విద్యారంగంలో జరిగిన అవలక్షణాలను ఎండగడుతూ ఉపాధ్యాయ సంఘాల నిర్మాణాన్ని కొనసాగించారన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింత నర్సింహ, జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, వేణు సంకోజు, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు యం.సోమయ్య, జలసాధన సమితి నాయకులు దుశ్చర్ల సత్యనారాయణ, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరమూర్తి, కేఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, వివిధ వి ద్యార్థి సంఘాల నాయకులు వి.అందీప్ (టీవీవీ), బి.కిరణ్ (పీడీఎస్‌యూ), బి.దేవేందర్ (టీజేఎఫ్), పందుల సైదు లు (బీడీఎస్‌ఎఫ్), వెంకన్న (టీఆర్‌ఎస్ వీ), ఈ.సాగర్ (పీడీఎస్‌యూ), ప్రజా సంఘాల నాయకులు భద్రయ్య, తీగల రత్నం, సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ వేదిక నాయకులు వేము ల యల్లయ్య, వెంకట్‌రెడ్డి, భీమార్జున్‌రెడ్డి, నర్సింహ, నాగార్జున, సురేందర్, చింతా ముత్యాల్‌రావు, పాశం నరేష్‌రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement