నకిరేకల్ , న్యూస్‌లైన్ : రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న సకల జన భేరి కార్యక్రమంలో విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
ఆదివారం నకిరేకల్‌లోని మల్లిఖార్జున డిగ్రీకళాశాలలో జరిగిన వేదిక జిల్లా కమిటీ సమావేశ ంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23న నూతనకల్‌లో సకల రణభేరి సదస్సు, 24న తుంగతుర్తి అర్వపల్లి, 25న నల్లగొండ టౌన్, మధ్యాహ్నం దేవరకొండ, 26న మిర్యాలగూడ, 27న మోత్కూర్, 28 జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె. ధర్మార్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. వె ంకటేశ్వర్లు, జిల్లా ప్రతినిధులు సైదులు, సత్యంగౌడ్, సతీష్ పాల్గొన్నారు.
‘సకల జనభేరి’ని జయప్రదం చేయాలి
Published Mon, Sep 23 2013 3:56 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement