హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ వీరంగం చేశాడు. నగరంలోని హుస్సేనీ ఆలం రోడ్డులో ఆదివారం ఆయన హోలీ సంబరాలు చేసుకుంటుడగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో రోడ్డు క్లియర్ చేయాల్సిందిగా కానిస్టేబుల్ వంశీ ఆయనకు సూచించారు. దీనిపై ఆగ్రహించిన అరవింద్ యాదవ్ కానిస్టేబుల్పై దాడి చేశాడు. ఈ సంఘటనలో వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్సం ఆయనను ఆస్పత్రికి తరలించారు.