మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. సమితి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. మంద కృష్ణ మాదిగ వర్గంగా కొందరు, దండు వీరయ్య వర్గంగా మరికొందరు వేరుపడ్డారు.
వీరిలో వీరయ్య వర్గానికి చెందినవాళ్లు మందకృష్ణ వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంద కృష్ణ సమక్షంలోనే రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.