కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.
కాకినాడ: కాపులకు రిజర్వేషన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. పార్టీలోని కాపు నేతల చేత చంద్రబాబు అబద్ధాలు మాట్లాడిస్తున్నారని ఆయన ఆరో్పించారు. కాపులను బీసీలలో చేర్చడానికి తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్ సాధనకై జనవరి 31న అన్నవరం- తుని మధ్యలో భారీ బహిరంగసభను నిర్వహిచనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.