ఎచ్చెర్ల: హత్య చేసి పొందూరు మండలం ధర్మపురం, బురిడి కంచరాం సరిహద్దుల్లో తగలబెట్టిన మృతదేహం ఘటనపై పోలీసులు సోమవారం దర్యాప్తు ముమ్మరం చేశారు. జేఆర్‌పురం సీఐ సాకేటి విజయకుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తగల బెట్టిన స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలు ఆధారంగా 302 (హత్య), 201 (సాక్ష్యాలు తారుమారు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా...ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసకు చెందిన పందిరపల్లి శంకరరావు అనే వ్యక్తి తన 18 ఏళ్ల కుమారుడు భరత్‌కుమార్ 15వ తేదీ నుంచి కనిపించటం లేదని ఎచ్చెర్ల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.
దీనిపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం సగంసగం కాలి ఉండడంతో మిగతా భాగాలను శ్రీకాకుళం రిమ్స్ తరలించగా.. ఆ భాగాలను మంగళవారం శంకరరావుకు చూపించారు. అయితే అదృశ్యమైన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి ఒక్కరే అన్న నిర్ధారణ మాత్రం జరగలేదు. డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా నిర్ధారించవల్సి ఉంటుంది. భరత్ కుమార్ పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేశారని.. మా కుటుంబానికి ఎవరితో శతృత్వం లేదని శంకరావు చెబుతున్నారు. కాగా కొందరు మాత్రం ఇదే గ్రామానికి చెందిన ఓ ప్రేమ విషయంలో ఈ యువకుడు ప్రమేయం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యువకుని అదృశ్యం కలకలం రేపుతోంది. మరో పక్క అదృశ్యమైన యువకుడి గ్రామానికి సమీపంలోనే హత్య జరగడంతో అనుమానాలకు తోవిస్తోంది. ప్రస్తుతానికి అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించామని.. హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీఐ వివరించారు.
హత్య కేసుపై దర్యాప్తు
Published Wed, Feb 18 2015 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM
Advertisement