నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: స్థానిక శ్రీనివాసనగర్‌లోని శిల్పా హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో గురువారం చోటు చేసుకున్న వంట మాస్టర్ బెల్లం కృష్ణ మృతి అనుమానాలకు తావిస్తోంది. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న టీడీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి వద్ద బేతంచెర్లకు చెందిన వంట మనిషిగా పనిచేస్తున్నాడు. శిల్పా స్థానికంగా లేకపోయినా ఇతను ఒక్కడే ఫ్లాట్‌లో ఉండేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి అతను ఉరేసుకుని మృతి చెందడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. అయితే మృతదేహాన్ని పోలీసులు రాకమునుపే కిందకు దించడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న సందేహాలున్నాయి. సాధారణంగా ఉరేసుకున్న వ్యక్తి మెడ నరాలు బిగుసుకుపోవడంతో పాటు నాలుక బయటకు రావడం సహజం.
అలాంటిది కృష్ణ గొంతుపై ఉరి వేసుకున్న గుర్తులు సరిగా లేకపోవడం కూడా హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అదేవిధంగా బేతంచెర్లలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులను వెంటనే నంద్యాలకు రప్పించి హడావుడిగా పోస్టుమార్టం కూడా పూర్తి చేయించడంలోని ఆంతర్యమేమిటో స్థానికులకు అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఏదేమైనా మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హత్యా.. ఆత్మహత్యా?
Published Sat, Oct 19 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement