'ఎప్పుడొచ్చినా పాదగయను దర్శించుకుంటాను' | music director MM srilekha is at padhagaya | Sakshi
Sakshi News home page

'ఎప్పుడొచ్చినా పాదగయను దర్శించుకుంటాను'

Published Tue, Jul 14 2015 10:21 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

'ఎప్పుడొచ్చినా పాదగయను దర్శించుకుంటాను' - Sakshi

'ఎప్పుడొచ్చినా పాదగయను దర్శించుకుంటాను'

పిఠాపురం టౌన్ : గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని సినీ సంగీత దర్శకురాలు, గాయని ఎంఎం శ్రీలేఖ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా పాదగయ క్షేత్రాన్ని దర్శించుకుంటానని తెలిపారు. పుష్కరాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినట్టు తెలిపారు.
 
రాజమండ్రి, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు. చిన్న వయసులోనే 75 సినిమాలకు సంగీతాన్ని అందించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్‌‌డ్సలో తన పేరు నమోదైందని, జాతీయ అవార్డు సాధించానని తెలిపారు. సినీరంగానికి మరిన్ని సేవలు అందించాలన్నదే తన కోరికని శ్రీలేఖ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement