నూజివీడు, న్యూస్‌లైన్ : పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహ నం కవరులో ఉంచిన లక్ష రూపాయల నగదును దుండగుడు పట్టపగలు సినీఫక్కీలో అపహరించుకుపోయాడు. సేకరించిన, పోలీ సు లు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన షేక్ అబ్దుల్ షానవాజ్ జంక్షన్ రోడ్డులో సూపర్‌బజార్ నిర్వహిస్తుంటారు. వ్యాపారానికి సంబంధించి లక్ష రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు బ్యాగ్‌లో పెట్టుకుని ట్యాంక్ మీద కవర్‌లో దానిని ఉంచి ద్విచక్రవాహనంపై ఎస్‌బీఐ బ్రాంచికి వెళ్లారు.
అక్కడ స్వైపింగ్ మిషన్ పనిచేయకపోవడంతో కళ్ళజోడు బాగుచేయిం చుకునేందుకు మైలవరం రోడ్డులోని అంబేద్కర్ సెంటరు ప్రాంతంలోని దుకాణం వద్దకు వెళ్లారు. నగదు ఉన్న బ్యాగ్‌ను బైక్ ట్యాంకుపైన కవర్‌లోనే ఉంచి కళ్లజోళ్ల షాపులోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగుడు బైక్‌పైన కవర్ తీసి నగదు బ్యాగ్‌ను చేజిక్కించుకున్నాడు. దీనిని షాపు యజమాని చూసి షానవాజ్‌ను అప్రమత్తం చేశారు. ఆయన బయటకు వచ్చి కేకలు వేస్తుండగా నంబరు లేని నలుపురంగు పల్సర్ బైక్ అక్కడకు వచ్చింది. దుండగుడు దానిపై ఎక్కగా, పెద్ద గాంధీబొమ్మ వైపు దూసుకుపోయింది. స్థాని కంగా సంచలనం కలిగించిన ఈ ఘటన గురిం చి బాధితుడు షానవాజ్ పట్టణ పోలీస్‌స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఐవీ నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్యాంకు వద్ద నుంచే
వెంబడించిన దుండగులు?
దుండగులు బ్యాంకు వద్ద నుంచి షానవాజ్‌ను వెంబడించి ఉంటారని భావిస్తున్నారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసే స్థితిలో ఉన్నట్లయితే పల్సర్ బైక్‌పై వెళ్లిన దుండగులను సులువుగా గుర్తించి, పట్టుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద నేరాలు జరి గినప్పడు హడావుడి చేయడం తప్ప మిగిలిన రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోకపోవడం పరిపాటైందని స్థాని కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆగంతకులు బ్యాం కులోనుంచి వెంబడించి ఉండి ఉంటే వారి ఆధారాలు అక్కడి సీసీ కెమెరాలలో లభ్యమయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.