హైదరాబాద్:కిరికిరి రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని బీజీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన సకల జన భేరీ సభలో మాట్లాడారు.కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులకు, రోడ్లకు తేడా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అనాధిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసానికి గురి చేస్తోందన్నారు. యూపీఏ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని ఆయన అన్నారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాకపోతే...బీజేపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని నాగం తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.