నాగార్జున సాగర్, న్యూస్‌లైన్ : నాగార్జున సాగర్ జలాశయం నుంచి క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. సోమవారం 8 క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు 64,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయిలో నిండడం, శ్రీశైలం నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు వదులుతున్నారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు 4 క్రస్ట్‌గేట్లు ఎత్తిన అధికారులు రాత్రికి 6 గేట్లకు పెంచారు. 18న మరో రెండు క్రస్ట్‌గేట్లను ఎత్తి మొత్తం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సందడి..
రెండేళ్ల తర్వాత క్రస్ట్‌గేట్లను ఎత్తడంతో సాగర్ సోయగాలను చూసేం దుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 550 అడుగులపై నుంచి స్ఫి ల్‌వే నుంచి కిందికి దూకుతున్న కృష్ణమ్మను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు.
లాంచీస్టేషన్‌కు తగ్గిన ఆదాయం
సాగర్ లాంచీస్టేషన్ ఆదాయం సోమవారం తగ్గింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం నాగార్జున కొం డకు లాం చీలు నడపలేదు. సోమవారం కూడా నడుపుతారో లేదోనని పర్యాటకులు లాంచీస్టేషన్‌కు రాకపోవడంతో ఆదాయం *30వేలకు పడిపోయింది. సాధారణ రోజుల్లో లాంచీస్టేషన్ ఆదాయం *70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. వాతావరణం సరిగాలేదని ఒక రోజు, సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట మరో రోజు లాంచీస్టేషన్‌ను మూసివేస్తుండడంతో సాగర్‌కు వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా లాం చీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో పర్యాటకులకు సమాదానం చెప్పలేక వాతావరణం అనుకూలించడం లేదని లాంచీలు నిలి పివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాగర్‌లో కొనసాగుతున్న నీటి విడుదల
Published Tue, Aug 20 2013 4:26 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement