కృష్ణా డెల్టాకు నీటి విడుదల
మరో రెండు రోజుల్లో కుడి కాలువకు ?
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి కృష్ణాడెల్టాకు ఆదివారం తెల్లవారుజాము నుంచి అధికారులు 1,133 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాడెల్టా ఆయకట్టు ప్రాం తంలో తాగునీటి అవసరాల నిమిత్తం నీటి ని విడుదల చేయాలని ప్రభుత్వం కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేసింది.
దీంతో 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు నాలుగు రోజుల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా డెల్టాకు నీటి విడుదల జరి గింది. మరో రెండ్రోజుల్లో కుడికాలువకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 509.40 అడుగుల వద్ద ఉంది. ఇది 130.6544 టీఎంసీలకు సమానం.