ఆశలపై క్రీనీడ..ఇదేం క్రూర క్రీడ! | Naidu Cheating Farmers On Loan Waiver: YSR Congress | Sakshi
Sakshi News home page

ఆశలపై క్రీనీడ..ఇదేం క్రూర క్రీడ!

Published Fri, Jul 25 2014 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఆశలపై క్రీనీడ..ఇదేం క్రూర క్రీడ! - Sakshi

ఆశలపై క్రీనీడ..ఇదేం క్రూర క్రీడ!

రుణవిముక్తి కల్పిస్తానని రైతుల్నీ, డ్వాక్రా మహిళల్నీ ఊరించిన చంద్రబాబు.. పబ్బం గడిచాక వారి ఆకాంక్షతో, ఆత్మాభిమానంతో చెలగాటమాడుతున్నారు. ‘తొలి సంతకమే రుణమాఫీపై’ అన్న ఆయన గద్దెనెక్కిన రెండునెలల తర్వాత కూడా మాఫీపై స్పష్టతను ఇవ్వకుండా వారిని అయోమయంలోకి నెట్టారు. వారికి ఆశాభంగంతో పాటు అవమానభారం తప్పనిస్థితిని కల్పించారు. రైతులకు లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు లక్ష మ్యాచింగ్ గ్రాంట్ పరిమితిని ప్రకటించినా..ఆ కాస్త మేలైనా అందేనో, లేదోనన్న అనుమానం కలిగిస్తున్నారు.
 
 సాక్షి, కాకినాడ :ఎన్నికల్లో చంద్రబాబు బల్లగుద్ది చెప్పిన రుణమాఫీ మాటలు నమ్మిన రైతులు, డ్వాక్రా మహిళలు గత ఆరేడు నెలలుగా వాయిదాలు కట్టడం మానేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ అవుతాయన్న వారి సంబరంపై అతిత్వరలోనే నీలినీడలు కమ్ముకున్నాయి. ని ఎదురు చూసిన వారి ఆశలు నిజంగానే అడియాసలయ్యాయి. ఇప్పుడు వారికి వాస్తవ పరిస్థితి బోధ పడుతోంది. రుణమాఫీపై విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండా జాప్యం చేస్తోంది. ఇదే అదనుగా పేరుకుపోయిన బకాయిల వసూళ్ల కోసం బ్యాంకర్లు నడుం బిగిస్తున్నారు.
 
 డ్వాక్రా సంఘాల వడ్డీ   సొమ్మును పొదుపు ఖాతాల నుంచి మినహాయించుకుంటూ వచ్చిన బ్యాంకర్లు  ఇప్పుడు బకాయిల వసూలుకుఅన్నదాతలు, డ్వాక్రా మహిళల పీకలపై కత్తి పెడుతున్నారు. నెలాఖరులోగా బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటున్నారు. అలా చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వర్తిస్తుందని, లేకుంటే కోల్పోతారని హెచ్చరిస్తు న్నారు. నెలాఖరులోగా బకాయిలన్నీ చెల్లిస్తే వెంటనే కొత్త రుణాలు మంజూరు చేస్తామని, బకాయిలు చెల్లించినంత మాత్రాన రుణమాఫీ వర్తించక పోదని నమ్మబలుకుతున్నారు. నెలాఖరులోగా చెల్లించకపోతే మాత్రం వచ్చే రుణమాఫీ లేదా మ్యాచింగ్ గ్రాంట్ మొత్తం పూర్తిగా  వడ్డీకే మినహాయించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రా బ్యాంక్ డీజీఎం వీఎస్ శేషగిరిరావు పి.గన్నవరంలో విలేకరుల వద్ద ఈ మేరకు స్పష్టం చేశారు.
 
 వడ్డీ రాయితీ కోసం హెచ్చువడ్డీకి అప్పు చేయాల్సిందే..
 వర్షాభావం, రుణమాఫీ సందిగ్ధంతో కొత్త అప్పులు పుట్టక పంటలు వేసుకోలేని రైతులు, కొత్త రుణాలు మంజూరు కాకపోవడంతో అంతర్గత కార్యకలాపాలు స్తంభించిన డ్వాక్రామహిళలు బ్యాంకర్ల ఒత్తిడితో దిక్కులు చూస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మాఫీ నాటకమని, వడ్డీ రాయితీ సాకుతో బకాయిలన్నీ వసూలు చేసుకోవాలని చూస్తున్నారని ఆక్రోశిస్తున్నారు.
 
 ఇప్పటికిప్పుడు బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. టెర్మ్ లోన్స్, కన్వర్టెడ్ క్రాప్ లోన్స్‌ను పక్కన పెడితే 3.60 లక్షల మంది రైతుల రూ.2,350 కోట్ల పంట రుణాలు, మరో 4.50 లక్షల మంది రైతుల రూ.3,860 కోట్ల బంగారు రుణాలతో పాటు 74 వేల డ్వాక్రా సంఘాలకున్న రూ.1343 కోట్ల బకాయిలు వడ్డీతో సహా నెలాఖరులోగా చెల్లించాలి. ఇంత పెద్ద మొత్తం చెల్లించాలంటే వారంతా రూ.5, రూ.10 వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తెచ్చి కట్టాల్సిందే. అంటే వడ్డీరాయితీ కోసం హెచ్చు వడ్డీలకు అప్పులు చేయాలన్న మాట. ఇది సాధ్యం కాదని తెలిసినా.. రైతులు, డ్వాక్రా మహిళల మెడపై కత్తిపెట్టయినా బకాయిలు వసూలు చేయించాలని ప్రభుత్వం చూస్తోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు రుణాలు చెల్లించ వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రుణాలు చెల్లించమని అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
 
 అంతా అయోమయమే..
 ఇదిలా ఉండగా లక్షన్నర వరకు రైతు రుణమాఫీ, గరిష్టంగా లక్ష వరకు డ్వాక్రా సంఘాలకు మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలూ రాలేదు. రైతు కుటుంబ ం యూనిట్‌గా లక్షన్నర మొత్తాన్ని నేరుగా బ్యాంకులకు చెల్లించి ఆ మేరకు తమ రుణాలను మాఫీ చేస్తారో లేక రీ షెడ్యూల్ చేసి ఆ భారాన్ని ప్రభుత్వం మోస్తుందో లేక తమపైనే మోపుతుందో రైతులకు తెలియడం లేదు. డ్వాక్రా సంఘాలకు గరిష్టంగా ఇస్తామంటున్న రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్  ఎప్పుడు, ఎలా, ఎన్ని విడతల్లో ఇస్తారో స్పష్టత లేదు.  మ్యాచింగ్ గ్రాంట్ కావడంతో ఈ మొత్తం సంఘాల పొదుపు ఖాతాలో జమవుతుందే తప్ప రుణఖాతాలో కాదని బ్యాంకర్లు చెబుతున్నారు.
 
 రైతు రుణాలకు సంబంధించి పంట, బంగారు రుణాల్లో వేటికి ప్రాధాన్యమివ్వాలి, ఏ అంశాల ప్రాతిపదికన కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తించాలి వంటి విషయాలపైనా స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఎంతమందికి ఏ మేరకు రుణాలు మాఫీ అవుతాయో చెప్పలేమంటున్నారు. మాఫీ చేయకుండా రు రీ షెడ్యూల్ చేస్తే మాత్రం పేరుకుపోయిన బకాయిలపై 12.5 శాతం వరకు వడ్డీ పడుతుందని చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయే రైతుల రుణాల రీ షెడ్యూల్‌పై ఏటా జూలై 1న ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేస్తుందని, అవి రుణమాఫీకి వర్తించవని అంటున్నారు.
 
 గతేడాది సంభవించిన ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని అప్పటి రుణాలను ఐదేళ్ల రీషెడ్యూల్‌కు అనుమతించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐని కోరిందని, ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకొని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి తగు ఆదేశాలు జారీ చేస్తే, ఆ తర్వాత జిల్లాలకు మార్గదర్శకాలు వస్తాయని, ఇదంతా జరగటానికి వారం , పది రోజుల పైనే పడుతుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అంతవరకూ రైతులకే కాదు.. తమకు కూడా స్పష్టత ఉండదని అంగీకరిస్తున్నారు. ఇక డ్వాక్రా రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement