
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయంలో నమిత, వీరేంద్ర వివాహం ఘనంగా జరిగింది. నమిత దంపతులను చూడటానికి భక్తులు పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment