
సాక్షి, తిరుపతి : హీరోయిన్ నమిత - వీరేంద్ర చౌదరి వివాహం ఘనంగా జరిగింది. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. తెలుగు సంప్రదాయంలో ఈ వివాహాం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ నటులు హాజరు అయ్యారు. రాధిక, శరత్‌కుమార్ ...వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కాగా గతరాత్రి వీరి సంగీత్ కార్యక్రమం ఓ ప్రయివేట్ హోటల్‌లో జరిగింది. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్ వీరు... పెళ్లి చేసుకుంటున్నట్లు కొద్దిరోజుల క్రితం నమిత ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నమిత 2002లో ఆర్యన్ రాజేశ్ హీరోగా తెరకెక్కిన ‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)




Comments
Please login to add a commentAdd a comment