17న హీరో బాలకృష్ణ నామినేషన్ ! | Nandamuri Balakrishna to file nomination from Hindupur | Sakshi
Sakshi News home page

17న హీరో బాలకృష్ణ నామినేషన్ !

Published Thu, Apr 10 2014 10:03 AM | Last Updated on Tue, Oct 2 2018 3:48 PM

17న హీరో బాలకృష్ణ నామినేషన్ ! - Sakshi

17న హీరో బాలకృష్ణ నామినేషన్ !

తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి హీరో బాలకృష్ణ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఆ అంశంపై ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో బాలకృష్ణ సుధీర్ఘంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో బాలకృష్ణ ఎన్నికల పోటీపై అధికారిక ప్రకటన వెలువడనుంది. హిందూపురం అసెంబ్లీ నియోకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఇప్పటికే బాలకృష్ణ సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నెల 17న బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. నందమూరి వంశానికి ఎంతో సన్నిహిత్యం ఉన్న హిందూపురం నుంచి బాలకృష్ణను ఎన్నికల బరిలో నిలపాలని అనంతపురం జిల్లా వాసులు ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి  బాలకృష్ణను ఎన్నికల బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement