ఘనంగా సైన్స్ డే
► ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు
► క్విజ్‌పోటీలు, సెమినార్లు
కర్నూలు సిటీ: నగరంలోని వివిధ పాఠశాలల్లో మంగళవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు సైన్స్‌పై క్విజ్, సెమినార్ తదితర పోటీలు నిర్వహించారు. తర్వాత సీవీ రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా స్కూళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశాభివృద్ధి సైన్స్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. స్థానిక ఏక్యాంపులోని మాంటిస్సోరి స్కూల్‌లో జరిగిన సైన్స్‌డేలో ఆ స్కూల్ డైరెక్టర్ రాజశేఖర్, హెచ్‌ఎంలు శశికళ, రమాజ్యోతి, కో–ఆర్డినేటర్లు.
శ్రీసాయికృష్ణ విద్యానికేతన్, బచపన్‌లో ఆ స్కూల్ డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, మీనా, కౌన్సిలర్ వందనరాణి, శ్రీలక్ష్మి విద్యాసంస్థల్లో హెచ్‌ఎం మాధవీలత, డైరెక్టర్ విష్ణుప్రియ, వైస్ చైర్మన్ శివ అనురాగ్, ప్రిన్సిపాల్ నయిషా తస్నీమ్, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్స్ కాలనీలోని భాష్యం స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమానికి అతిథిగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు గోవిందురాజులు హాజరై మాట్లాడారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్, జోనల్ ఇన్‌చార్జ్ అనిల్ కుమార్, లిటిల్ చాంప్స్ ఇన్‌చార్జీ మాధవీలత. చెకుముకి సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రాయలసీమ మోడల్ హైస్కూల్‌లో నిర్వహించిన సైన్స్‌డేలో జనవిజ్ఞాన వేదిక సాంకేతిక కన్వీనర్ విజయ్‌కుమార్, హెచ్‌ఎం సరయు సత్యవాణి, స్థానిక ఎన్‌ఆర్ పేట భాష్యం స్కూల్‌లో ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ డీఈఓ మౌలాలి, జోనల్ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్, హెచ్‌ఎం రమేష్, చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో టీచర్లు పాల్గొన్నారు.