ఒంగోలు సెంట్రల్: ఆర్టీసీ బస్సుల్లో రాయితీతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన నవ్య, క్యాట్ కార్డులను బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు జేబులకు చిల్లులు పడనున్నాయి. రాయితీ వలన ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తుందనే సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో దాదాపు 30 వేలకు పైగా ఇలాంటి కార్డులున్నాయి. రూ. 250 చెల్లిస్తే సంవత్సరం మొత్తం 10 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. దీంతో ఎక్కువగా ప్రయాణించే వారు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తీసుకొనేవారు.
తాజా నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. అక్యుపెన్సీ రేటును తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయిం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డుల ద్వారా 30 కిలో మీటర్ల దూరం దాటితే రాయితీ లభించేదని ఆర్టీసీ ఆర్‌ఎం ఆదాం సాహెబ్ తెలిపారు. అయితే నూతనంగా కార్డుల జారీ నిలిపి వేశామని చిల్లర సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment