హన్మకొండ టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ విధానాలు, అన్యాయం వ ల్లే నక్సలిజం పుట్టిందని టీటీడీపీ క న్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో హెచ్‌ఎండీఏ పరిధి, హైదరాబాద్ యూటీ అంటూ కొందరు నాయకులు ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో ఏం ఒప్పందం చేసుకున్నారో కేసీఆర్ తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని తాను తప్పుబట్టానని పేర్కొన్నారు.
చంద్రబాబు ఇద్దరిని పిలిచి మాట్లాడినా తాను అదే విషయాన్ని చెప్పినట్లు స్పష్టం చేశారు. పిటిషన్ విత్‌డ్రా చేసుకుంటే సీఎం రమేష్‌తో రాజీపడతానని బాబుకు కరాఖండిగా చెప్పానన్నారు. తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్న సుమారు 181 కిలోమీటర్ల మేరకు గోదావరి నది పరివాహక ప్రాంతంపై సీమాంధ్రులు కన్నేశారని ఆరోపించారు. టీడీపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య, అర్బన్ పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, నాయకులు పుల్లూరు అశోక్‌కుమార్, మనోజ్‌కుమార్, దేవేందర్ పాల్గొన్నారు.
బ్లాక్ మెయిలింగ్‌లో కేసీఆర్, కేటీఆర్‌లు సిద్ధహస్తులు
ప్రైవేట్ సంస్థలను బ్లాక్ మెయిలింగ్ చేయడంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సిద్ధహస్తులని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయగా ఇప్పుడు కేటీఆర్ విద్యాసంస్థలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణపై రోజుకో మాట చెబుతున్న కాంగ్రెస్‌ను ఏమి అనని టీఆర్‌ఎస్ నేతలు టీడీపీని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు భాస్కుల ఈశ్వర్, మార్గం సారంగపాణి, మనోజ్‌గౌడ్ పాల్గొన్నారు.
అన్యాయం వల్లే నక్సలిజం: ఎర్రబెల్లి దయాకర్‌రావు
Published Wed, Nov 20 2013 2:40 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement