అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దారుణం జరిగింది.
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దారుణం జరిగింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించడంతో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భణికి సకాలంలో వైద్య సహయం అందలేదు. ఈ నేపథ్యంలో శిశువు మరణించింది.
దాంతో కాన్పు కోసం వచ్చిన బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్య సిబ్బంది అలసత్వం కారణంగానే శిశువు మరణించిందని వారు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్నవారిని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.