సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల నేతన్నలకు కేంద్రప్రభుత్వం నూలు బ్యాంకు మం జూరు చేసింది. రూ.కోటి నిధితో నూలు బ్యాంకు నిర్వహణకు మార్గదర్శకాలు జారీచేసింది. మరమగ్గాల సేవాకేంద్రం అసిస్టెంట్ డెరైక్టర్ రవికుమార్, చేనేతజౌళి శాఖ ఏడీ వెంకటేశ్వర్‌రావు, డీవో అశోక్‌రావు సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో బుధవారం సమావేశమయ్యారు. స్పెషల్‌పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు కేంద్ర జౌళిశాఖ అనుమతి ఇచ్చింది. 11మంది సభ్యులతో కూడిన రిజిస్ట్రర్డ్ కోఆపరేటివ్ సొసైటీ, ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూలు బ్యాంకు నిర్వహణ జరుగుతుంది. భారత ప్రభుత్వం జౌళి శాఖ ద్వారా రూ.కోటి వరకు వడ్డీలేని నిధిని విడుదల చేస్తుంది. ఎస్‌పీవీ సభ్యులు మరో రూ.కోటి జమ చేసి రూ.రెండు కోట్లతో నూలు బ్యాంకు ఏర్పాటు చేసి సిరిసిల్ల నేతన్నల వస్త్రోత్పత్తికి నేరుగా సరఫరా చేసే అవకాశం ఉంది. సిరిసిల్ల లో డిపో ఏర్పాటు, వస్త్రోత్పత్తిదారుల స్పందన, నూలు బ్యాంకు నిర్వహణపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని కేంద్ర జౌళి శాఖ కోరింది. ఈ మేరకు జౌ ళి శాఖ అధికారులు సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. మూడేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుం దని, యారన్ బ్యాంకు నిర్వహణను సేవాభావంతో చేయాలని పేర్కొంది.
నూలు బ్యాంకు నిర్వహణలో ఎస్‌పీవీ సభ్యులతోపాటు, జౌళి శాఖ అధికారు లు సంయుక్తంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సిరిసిల్ల నేతన్నలకు భారంగా మారిన ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయగా, ఇప్పటికే చెల్లించిన వారికి ఆమేరకు డబ్బు రీయిం బర్స్‌మెంట్ చేయాలని నిర్ణయిం చడం నేతన్నల్లో ఆనందాన్ని నింపింది. సెస్‌లో యాభైశాతం విద్యుత్ రాయితీకి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం మంజూ రు చేయడం విశేషం. తాజాగా నూలు బ్యాంకు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బొద్దుల సుదర్శన్, మండల సత్యం, ఆడెపు రవీందర్, శ్రీనివాస్, కొండ ప్రతాప్ పాల్గొన్నారు.
సిరిసిల్లలో నూలు బ్యాంకు
Published Thu, Dec 12 2013 3:55 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
Advertisement